Telugu Stories

రామాయణం బాలకాండ – 3

Login to Play your Story!

విశ్వామిత్రుడి యాగం సఫలం కావడం, రాముడు తాటాకిని సంహరించడం, మరెన్నో సూక్ష్మ వివరములతో ఈ భాగం…

రామాయణం బాలకాండ – 2

Login to Play your Story!

ఋష్యశృంగుడు దశరథుడి వద్ద అతిధిగా ఉంటున్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు మొదలుపెట్టారు..

రామాయణం బాలకాండ – 1

Login to Play your Story!


నారద మహాముని వాల్మీకి ఆశ్రమం వచ్చి సకల సద్గుణ సంపన్నుడు, మహా పరాక్రముడు అయిన పురుషుడు ఈ యుగంలో ఉన్నాడా అని అడిగినప్పుడు, వాల్మీకి మహాముని రాముడి గురించి సవిస్తరంగా ఇలా చెప్పసాగాడు…

Source – Chandamama magazine

తెలివి [ Intelligent ]

Login to Play your Story!


విజయుడు అనే ఒక రాజు ఒక సమర్థ పాలకుడు, కానీ అతనికి అతిశయోక్తి చాలా ఎక్కువ! రాజుకి ఎలా అయినా తెలిసొచ్చేలా చేయాలనుకుని మంత్రి ఒక పథకం వేసాడు. అది ఏమిటో ఈ కథ వినండి!

Vijay is an able king, however he often thinks he is the most smart on this entire planet. His minister wants to set things straight for King and comes with a simple plan…

💌 కొత్త సంవత్సరం, కొత్త కథలు

ప్రియమైన శ్రోతలకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    కథచెప్త స్థాపించి ఒక ఏడాది పూర్తయింది. లక్షకు పైగా శ్రోతలు, 300 కి పైగా కథలు, 2000+ నిమిషాల పాటు నిరంతరాయంగా కథలు, ప్రపంచ నలుమూలల నించి శ్రోతలు ప్రతిరోజూ మా కథలు విని ఆస్వాదిస్తున్నారు. మీకు తెలుసో లేదో, మా కథలు podcast రూపంలో, website రూపంలో, smart speakers మరియు Apps రూపంలో మీకు  అందిస్తున్నాము. మరియు, అనేక కొత్త పద్ధతుల్లో మీకు కథలు అందించడం కోసం మేము నిత్యం కృషి చేస్తున్నాము.

తెలుగు భాషను భావితరాలకు అందించే మా సంకల్పం ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకునేలా చేసింది. ఇదంతా కేవలం మీ ఆదరాభిమానాల వల్లే సాధ్యం అయింది, అందుకు మా అందరి తరపునించి మీకు ధన్యవాదములు! 

కథలు చదివే ఆసక్తి ఉన్నవారు, మా website ని సందర్శించండి, పూర్తి వివరాలు అందులో కలవు.. మీ కథల కోసం మేమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాము! 

మాకు మరేరకంగా అయినా సహాయ పడే సదుద్దేశం కలిగిన వారు yourstruly @ kadachepta.com కి ఒక జాబు రాయగలరు. 

వింటూనే ఉండండి kadachepta.com!

ఎన్ని సార్లు విన్నా తనివి తీరనివి మన రామాయణం, మహాభారత ఇతిహాసములు. ఎందరో మహానుభావులు వీటిని వాడుక భాషలో అనువదించి, ప్రవచనాలుగా, కదిలే బొమ్మలుగా, సినిమాలుగా తీసి మనల్ని జ్ఞానులని చేస్తున్నారు. 

చాలా కాలంగా మేము వాడుక భాషలో, వివరం కోల్పోకుండా, పిల్లలకు అర్థమయ్యేలా ఉండే రామాయణం కోసం వెతుకగా మాకు ఈ చందమామ రామాయణం తారసపడింది. ఇంకేం! మా ఆనందానికి  ఫలితంగా ఈ శ్రవణ సంపుటి రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము.

మరి మీరు, మీ పిల్లలు వింటారు కదూ?